ఆన్‌లైన్ షాపింగ్ మాయ.. భార్య గోల.. భర్త కామెడీ టైమింగ్ మామూలుగా లేదు!

కపుల్స్ కామెడీ వీడియోలకు( Couples Comedy Video ) ఇంటర్నెట్లో ఫుల్ పేజ్ ఉంటుంది.ఇటీవల “విహాన్న్009” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ షేర్ చేసిన ఒక ఫన్నీ కపుల్ వీడియో సైతం తెగ వైరల్ అవుతోంది.

 Couples Funny Video On Online Shopping Scam Video Viral Details, Husband, Wife,-TeluguStop.com

భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ సీన్‌ను చూపించేఈ వీడియోకి రెండు రోజుల్లోనే 19 లక్షల వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు.వ్యూస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

ఇంతకీ వీడియో ఏంటంటే, భార్య ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న పార్సిల్‌ని ఓపెన్ చేస్తుంది.ఫోన్‌లో చూసిన పిక్‌కి, చేతిలో ఉన్న వస్తువుకి అస్సలు పోలికే ఉండదు.దాంతో ఫుల్లుగా ఫ్రస్టేట్ అయిపోయి, ఆన్‌లైన్ షాపులు( Online Shops ) ఎలా బురిడీ కొట్టిస్తాయో భర్తకి చెబుతుంది.రిటర్న్ చేసే ఆప్షన్ కూడా లేదని మరింత చిరాకు పడుతుంది.

అప్పుడా భర్త( Husband ) కూల్‌గా “ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్? ఏం కాదు.ఇలాంటి సీన్ నాకు కూడా రెండేళ్ల క్రితం జరిగింది.చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో” అని చెప్పి సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంటాడు.అప్పుడామెకి విషయం అర్థమవుతుంది, అతను షాపింగ్( Shopping ) గురించి కాదు, వాళ్ల పెళ్లి గురించి అన్నాడని! అంతే, ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే నవ్వాపుకోలేరు.నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి పగలబడి నవ్వుకుంటున్నారు

51 వేలకు పైగా లైక్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ వీడియో నెటిజన్లకి ఫుల్ కామెడీ ట్రీట్‌లా ఉంది.ఒక నెటిజన్ అయితే ఫన్నీ కామెంట్ చేస్తూ, “అన్నా, లైఫ్ రిస్క్‌లో పెట్టేస్తున్నావ్ ఏంటి?” అని అడిగాడు.ఇంకొకరు “ఇలాంటి స్కామ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి” అని కామెంట్ చేశారు.చాలామంది నవ్వుతున్న ఎమోజీలతో భర్త వేసిన కౌంటర్‌కి పడిపోయారు.ఈ లైట్ హార్టెడ్ వీడియో అన్ని కపుల్స్‌కి బాగా కనెక్ట్ అయింది.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube