ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులు మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, కొన్నిసార్లు షాకింగ్ ఘటనలకు వేదికగా మారుతున్నాయి.డ్రైవర్ల ప్రవర్తనపై ఫిర్యాదులు వింటూనే ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రయాణికులూ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో( Viral Video ) ఒక మందుబాబు మహిళ క్యాబ్ డ్రైవర్‌పై( Cab Driver ) దారుణంగా దాడి చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
“ఘర్ కే కలేష్” అనే X (ట్విట్టర్) అకౌంట్‌లో 2024, డిసెంబర్ 31న పోస్ట్ చేసిన ఈ వీడియోకి 39 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.వీడియోలో, ఒక క్యాబ్ డ్రైవర్‌కి, ఫుల్లుగా మద్యం సేవించిన ఒక మహిళకి( Woman ) మధ్య భీకరమైన వాగ్వాదం జరిగింది.
డ్రైవర్ తన ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా, “నన్ను తాకవద్దు మేడమ్” అని ప్రాధేయపడుతున్నా, ఆ మహిళ అతన్ని పదే పదే కొడుతూ వీరంగం సృష్టించింది.
అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే, ఆ మహిళ తన గమ్యస్థానం కాకుండా వేరే చోట దిగాలని డ్రైవర్‌ని బలవంతం చేసింది.డ్రైవర్ ఆమెను ఒరిజినల్ డ్రాప్ పాయింట్‌కి చేరుకున్నామని చెప్పినా వినలేదు.దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ ఒక లేడీ డాన్( Lady Don ) మాదిరి తన ఫోన్‌తో డ్రైవర్ తలపై బలంగా కొట్టడంతో అతను కారు దిగిపోవాల్సి వచ్చింది.
ఈ ఘటనతో క్యాబ్ డ్రైవర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
వీడియోలో ఈ ఘటన దుబాయ్‌లో జరిగినట్లు ఉంది, కానీ నెటిజన్లు దీన్ని ప్రశ్నిస్తున్నారు.దుబాయ్‌లో( Dubai ) కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్‌లో ఉంటాయని, వీడియోలోని కారు రైట్ హ్యాండ్ డ్రైవ్‌లో ఉందని అంటున్నారు.దీంతో ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది సస్పెన్స్‌గా మారింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేస్తూ, “ఊబర్ డ్రైవర్ జీవితంలో ‘రాంగ్ టర్న్’ తీసుకున్నట్లున్నాడు.
డ్రామా వద్దు, మ్యాప్స్‌ని ఫాలో అవ్వండి!” అని అన్నాడు.మరికొందరు ఆ మహిళను విమర్శిస్తూ, “అధికారులు దీన్ని చూస్తే ఆమె జైలుకు వెళ్లడం ఖాయం” అని కామెంట్ చేశారు.
ఇంకొక నెటిజన్ దుబాయ్ క్లెయిమ్‌ను అనుమానిస్తూ, “ఇది దుబాయ్ కాదు.ఇక్కడ కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్‌లో ఉంటాయి” అని తేల్చి చెప్పాడు.
ఇలా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.