అంతరిక్షంలో ఒకే రోజు 16 సూర్యోదయాలు.. సునీతా విలియమ్స్‌కి అద్భుతమైన అనుభవం!

సునీతా విలియమ్స్( Sunita Williams ) కొత్త సంవత్సరాన్ని అంతరిక్షంలో అదిరిపోయేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ISS ) లో ఉన్న ఆమె, ఒక్క రోజులో ఏకంగా 16 సార్లు సూర్యోదయాన్ని, 16 సార్లు సూర్యాస్తమయాన్ని చూస్తారు.

 Sunita Williams Will See 16 Sunrises While Soaring Into New Year In Space Detail-TeluguStop.com

ఇదేం మ్యాజిక్ అనుకుంటున్నారా? ISS భూమి చుట్టూ రాకెట్ వేగంతో తిరుగుతుంది.జస్ట్ 90 నిమిషాల్లో భూమిని ఒక రౌండ్ వేస్తుంది.

అందుకే ఇలా ఒకే రోజులో చాలా సార్లు సూర్యుడు ఉదయించడం,( Sunrise ) అస్తమించడం( Sunset ) కనిపిస్తుంది.

ISS తన X (ట్విట్టర్) అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

అందులో “2024కి బైబై చెప్తూ, ఎక్స్‌పెడిషన్ 72 టీమ్ కొత్త సంవత్సరంలోకి దూసుకుపోతూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తారు.అంతరిక్షం నుంచి గతంలో కనిపించిన కొన్ని సూర్యాస్తమయాల పిక్స్ ఇక్కడ ఉన్నాయి” అని రాసి పోస్ట్ చేసింది.

సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌తో కలిసి బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో( Boeing Starliner Spaceship ) జూన్‌లో ISSకి వెళ్లారు.మొదట్లో వాళ్ల మిషన్ కేవలం 9 రోజులే అనుకున్నారు.

కానీ, అనుకోని కారణాల వల్ల వాళ్ల స్టేని ఎక్స్‌టెండ్ చేయాల్సి వచ్చింది.దీంతో వాళ్లు క్రిస్మస్‌ను కూడా స్పేస్‌లోనే జరుపుకున్నారు

నాసా షేర్ చేసిన ఒక వీడియోలో, సునీతా విలియమ్స్ ఈ అనుభవాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు.“ఇక్కడ ఉండటం చాలా బాగుంది” అని ఆమె అన్నారు.అంతేకాదు, తమ ఏడుగురు వ్యోమగాముల టీమ్ ISSలో క్రిస్మస్‌ను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నట్లు చెప్పారు.

వీడియోలో వాళ్లంతా శాంటా టోపీలు పెట్టుకుని సందడి చేశారు.నాసా స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా పంపిన క్రిస్మస్ గిఫ్ట్స్‌లో ఇవి కూడా ఉన్నాయి.

సునీతా విలియమ్స్, విల్మోర్ 2025, ఫిబ్రవరిలో భూమికి తిరిగి రావాల్సి ఉంది.కానీ, స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ ఆలస్యం అవ్వడం వల్ల వాళ్ల రిటర్న్ 2025, మార్చికి పోస్ట్‌పోన్ అయింది.క్రూ-10 మిషన్ వాళ్లని రీప్లేస్ చేయాలి.సెప్టెంబర్‌లో ISSకి వచ్చిన క్రూ-9 వ్యోమగాములు, విల్మోర్, విలియమ్స్ తిరిగి రావడానికి రెండు ఖాళీ సీట్లు తెచ్చారు.క్రూ-10 మిషన్ వచ్చిన తర్వాత నలుగురు వ్యోమగాములు కలిసి భూమికి వస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube