మరో భారీ ప్రాజెక్టుకు చంద్రబాబు శ్రీకారం .. రాయలసీమకు పండుగే 

టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు,  అభివృద్ధి పనులకు సంబంధించి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వేగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Cm Chandrababu Naidu Undertake Banakacherla Godavari Interlinking Project Detail-TeluguStop.com

  ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు .ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.తద్వారా తమ ప్రభుత్వంలో రైతులకు( Farmers ) మేలు జరగాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.ముఖ్యంగా నదుల అనుసంధానం విషయంలో కేలకంగా వ్యవహరిస్తున్నారు.గత టిడిపి ప్రభుత్వ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి కృష్ణ,  గోదావరి నదులను అనుసంధానం చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే తరహాలో నదుల అనుసంధానానికి సంబంధించి మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు.

Telugu Ap, Cm Chandrababu, Janasena, Krishna River, Pattiseema, Rayalaseema-Poli

రాయలసీమలో( Rayalaseema ) ఉన్న బసకచర్ల కు( Banakacherla ) పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలించడం ద్వారా కృష్ణ,  గోదావరి నదులను అనుసంధానం చేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టుపోతున్నారు.  గతంలో పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) కాలువ ద్వారా పట్టిసీమ ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చి , అక్కడ నుంచి కృష్ణ నదికి నీళ్లు అందించిన చంద్రబాబు,  ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా నదిపై( Krishna River ) ఆధారపడిన బసకచర్లకు నీళ్లు ఇవ్వడం ద్వారా , రాయలసీమకు సాగు, తాగు నీటి ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు.గోదావరి బసకచర్ల ప్రాజెక్టును హైబ్రిడ్ విధానంలో చేపట్టాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది .దీంట్లో కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు , ప్రభుత్వ,  ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండేలా చూస్తున్నారు. 

Telugu Ap, Cm Chandrababu, Janasena, Krishna River, Pattiseema, Rayalaseema-Poli

రాబోయే మూడేళ్లలో రాయలసీమకు గోదావరి జలాలు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.ఈ ప్రాజెక్టు డి పి ఆర్ ను మూడు నెలల్లో సిద్ధం చేయనున్నారు.  ఆ తర్వాత టెండర్లను పిలిచి హైబ్రిడ్ విధానంలో పనులు చేపట్టనున్నారు.

  గోదావరి జలాలను బసకచర్లకు తరలించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయంగా చంద్రబాబు చెబుతున్నారు.గోదావరి జలాలను బసకచర్లకు తరలించే ప్రాజెక్టుపై చంద్రబాబు తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

  స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ లో 10 సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామని,  ఎన్టీఆర్ సీఎం అయ్యే వరకు సీమ కు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఎవరూ చేయలేదని గుర్తు చేశారు.గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే మూడువేల టిఎంసిల నీటిలో 300 టీఎంసీల నీటిని ఓడిసిపట్టడమే లక్ష్యంగా బసకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు , 7.5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని బాబు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube