ఉగాదికి ఉచిత బస్సు .. సంక్రాంతికి మరో పథకం 

ఏపీ ఎన్నికల్లో టిడిపి( TDP ) ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నా,  కొన్ని హామీల అమలు ఆలస్యం అవుతుండడం , దీనిపై ప్రజలను చర్చ జరుగుతున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో సీరియస్ గానే ఉన్నారు టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు.( CM Chandrababu ) ముఖ్యంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా,  అది కార్యరూపం దాల్చడం లేదు.

 Cm Chandrababu Naidu To Implement Free Bus Journey Scheme From Ugadi Details, Ap-TeluguStop.com

  ఈ ఏడాది సంక్రాంతికి ఉచిత బస్సు ప్రయాణం ను( Free Bus Journey ) ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినా, దానిని మళ్ళీ వాయిదా వేశారు.

Telugu Ap Farmers, Ap, Cm Chandrababu, Bus Scheeme, Tdp, Ugadi, Bus Journey-Poli

అయితే ఈ సంక్రాంతికి( Sankranti ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నారు ఉచిత బస్సు స్థానంలో మరొక హామీని అమలు చేసే విషయం పైన కసరత్తు చేస్తున్నారు.వాస్తవంగా ఈ సంక్రాంతి నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించాలని భావించిన బాబు ఒక కమిటీని నియమించారు.ఇతర రాష్ట్రాలలో అధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

అయితే సంక్రాంతి నాటికి ఆ నివేదిక ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు అని అధికారులు చంద్రబాబుకు చెప్పడంతో,  ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని బాబు ఆదేశించారు.ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలో 11 మంది అదనపు సిబ్బంది నియమించడంతో పాటు,  రెండు వేల ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాలని ప్రతిపాదన చేయడంతో ప్రస్తుతానికి ఈ పథకాన్ని వాయిదా వేశారు.

  ఉగాది( Ugadi ) అంటే మార్చి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించే ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉంది.

Telugu Ap Farmers, Ap, Cm Chandrababu, Bus Scheeme, Tdp, Ugadi, Bus Journey-Poli

అయితే ఈ ఏడాది సంక్రాంతికి మరో పథకాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు.ముఖ్యంగా

రైతులను

( Farmers ) దృష్టిలో పెట్టుకుని వారికి ఇచ్చిన హామీని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.  రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలలో ప్రకటించారు.

  తొలి విడతగా ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేందుకు నివేదికను సిద్ధం చేయాలని తాజాగా అధికారులకు సూచించినట్లు సమాచారం .ఈ పథకానికి మొన్నటి బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరగలేదు .దీంతో ఈ సంక్రాంతి నుంచి అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.అయితే దీనికి ఎంతో సమయం లేకపోవడంతో నిధుల సమీకరణ ఏ విధంగా చేపట్టాలనే  దానిపైన అధికారులతో చర్చిస్తున్నారు.

జనవరి మొదటి వారంలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube