యెమెన్‌లో భారతీయ నర్స్‌కు మరణశిక్ష .. ఏడేళ్లుగా జైల్లోనే , ఎవరీ నిమిష ప్రియ?

ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దేశం కానీ దేశాలకు వలస వెళ్తున్న భారతీయులు అక్కడ అనుకోని ఆపదల్లో చిక్కుకుంటున్నారు. ట్రావెల్ ఏజెంట్స్ చేతిలో మోసానికి గురై నానా ఇబ్బందులు పడుతున్న వారెందరో.

 Indian-origin Nurse Nimisha Priya Has Been Awarded Death Penalty In Yemen , Yeme-TeluguStop.com

ఇక పరాయి గడ్డపై ఏదైనా నేరంలో ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు.కాగా.

యెమెన్‌లో( Yemen ) ఓ భారతీయ నర్సు మరణ శిక్షను ఎదుర్కొంటున్నారు.యెమెన్ జాతీయుడిని చంపిన కేసులో నిమిష ప్రియ అనే మహిళకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించగా.

ఆ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలిమి ( Rashid Al Alimi )దానిని ఖరారు చేసినట్లు మంగళవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.అయితే ఆమెను విడిపించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

కేరళకు చెందిన నిమిష ప్రియ( nimisha priya ).నర్స్‌ కోర్సును పూర్తి చేసి 2008లో యెమెన్ వెళ్లి ఉద్యోగంలో చేరారు.ఈ క్రమంలో 2011లో తిరిగి భారతదేశానికి వచ్చి కేరళకు చెందిన థామస్( Thomas ) అనే వ్యక్తిని పెళ్లాడింది.అయితే యెమెన్‌లో ఓ క్లినిక్ పెట్టాలని ఆమె అనుకున్నారు.

కానీ ఆ దేశ నిబంధనల ప్రకారం వ్యాపారంలో స్థానిక వ్యక్తి భాగస్వామిగా ఉండాలి.దీంతో స్థానిక పౌరుడైన తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని భార్యాభర్తలిద్దరూ తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుని అనుకున్న ప్రకారం క్లినిక్ ప్రారంభించారు.

Telugu Indianorigin, Kerala, Nimisha Priya, Nursenimisha, Rashid Al Alimi, Thoma

అయితే ఓ శుభకార్యం నిమిత్తం ప్రియ- థామస్‌లు మరోసారి కేరళకు వచ్చారు, కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రియ ఒక్కరే యెమెన్ వెళ్లారు.అక్కడికి వెళ్లిన తర్వాత మెహది ఆమెను వేధింపులకు గురిచేయడంతో పాటు డబ్బు లాక్కున్నట్లుగా ప్రియ కుటుంబం చెబుతోంది.పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొని ఆమెను తన భార్యగా చెప్పుకున్నట్లుగా ఆరోపిస్తోంది.చివరికి మెహదిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోవడంతో 2017లో అతనికి మత్తు మందు ఇచ్చి పాస్‌పోర్ట్ సంపాదించాలని ప్రియ అనుకుంది.

అయితే ఆ డోస్ పరిమితికి మించడంతో మెహది చనిపోయాడు.దీంతో కంగారు పడిన ప్రియ అతని మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో వాటర్ ట్యాంక్‌లో పడేసింది.యెమెన్ నుంచి సౌదీకి పారిపోతుండగా.పోలీసులు నిమిష ప్రియను అరెస్ట్ చేశారు.

Telugu Indianorigin, Kerala, Nimisha Priya, Nursenimisha, Rashid Al Alimi, Thoma

అయితే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే నిందితులను విడుదల చేసే మార్గం ఉండటంతో ప్రియ కుటుంబం దాదాపు 40 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.34,20,000)ను చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.అయితే బాధితుడి కుటుంబానికి, ప్రియ ఫ్యామిలీకి, భారత రాయబార కార్యాలయానికి సమన్వయం చేసేందుకు వచ్చిన ఓ న్యాయవాది దాదాపు 20 వేల డాలర్లు తనకు ఇవ్వాలని మొండికేయడంతో అడుగు ముందుకు పడలేదు.దీంతో 2017 నుంచి యెమెన్ జైల్లోనే ప్రియ మగ్గుతున్నారు.

తాజాగా ఆమె మరణశిక్షను అధ్యక్షుడు ఖరారు చేయడంతో ప్రియ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube