2025 సంవత్సరంలో అడుగుపెట్టనుండటం సినీ అభిమానులకు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది.2025 సంక్రాంతి పండుగ కానుకగా క్రేజీ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.2024 సంవత్సరంలో స్టార్ హీరోల సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో 2025 సంవత్సరం సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.2025 టాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత కలిసిరావాలని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
2025లో రిలీజ్ కానున్న తొలి భారీ బడ్జెట్ సినిమా ఏదనే ప్రశ్నకు గేమ్ ఛేంజర్ సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది.జనవరి నెల 10వ తేదీన గేమ్ ఛేంజర్ ( game changer )రిలీజ్ కానుండగా డాకు మహారాజ్( DAKU MAHARAJU ) జనవరి 12వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki vastunnam ) జనవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నాయి.
ది రాజాసాబ్, ఓజీ, హరిహర వీరమల్లు, విశ్వంభర, ఘాటీ, తండేల్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో లక్ పరీక్షించుకుంటుండగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.నాగార్జున కుబేర సినిమాతో లక్ పరీక్షించుకోనున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.
రిషబ్ శెట్టి కాంతార1, నాని హిట్3 సినిమాలు సైతం భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.
2025 సంవత్సరం హీరోలకు ఎంతమేర కలిసొస్తుందో చూడాల్సి ఉంది.2025 సంవత్సరంలో తెరకెక్కుతున్న సినిమాల బడ్జెట్ 3000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని తెలుస్తోంది.2025 సంవత్సరంలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.2025 సంవత్సరం సినీ హీరోలకు కొత్త ఆశలను నింపుతోంది.2025 సినిమాలలో ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయేమో చూడాల్సి ఉంది.2025 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం 2000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును సొంతం చేసుకోవాల్సి ఉంది.టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.