గర్భిణుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ సేవలు అందించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి లో ప్రసూతి సేవల కోసం వచ్చే గర్భిణులకు ( pregnant women ) వైద్య సేవలు వేగంగా అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిఆర్ వ్యవస్థ( PR system ) (మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్) పనితీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షలు, చికిత్స, డెలివరీ కోసం వచ్చే గర్భిణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా సేవలు అందేలా చూడాలనీ వైద్యాధికారులు, మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

 Services Should Be Provided In A Friendly Manner Towards Pregnant Women , Pregna-TeluguStop.com

ఆసుపత్రికి వచ్చిన గర్భిణుల వివరాలు నమోదు నుంచి , పరీక్షలు, స్కానింగ్, లేబర్ రూం తదితర సేవలను పరిశీలించారు.గర్భిణిలలో జిల్లా కలెక్టర్ స్వయంగా మాట్లాడారు.

కొనరావుపేట మండలం నిజాంబాద్ గ్రామానికి చెందిన గర్భిణి మిరియాల శైలజ తో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.హై రిస్క్, రక్త హీనత సమస్యలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

ఆమె రిపోర్ట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కొంచెం ఐరన్ తక్కువగా ఉందని పోషకాహారం తో కూడిన ఆహారం గట్టిగా తినాలని చెప్పారు.పిఆర్ వ్యవస్థ ప్రభావంతంగా అమలు అయ్యేందుకు జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు, వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ వ్యవస్థ లో అమలులో మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఎంతో కీలకం అన్నారు.

గర్భిణులు వేచి ఉండే ప్రదేశంలోనే బయోమెట్రిక్ తీసుకోవాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులను ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube