రాస్తా రొకోల పేరుతో రోడ్ల మీదకు వచ్చి ప్రజా రవాణాకు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప, రాస్తా రొకోల పేరుతో రోడ్ల మీదకు వచ్చి ప్రజా రవాణాకు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… సోమవారం గంభీరావుపేట్ మండలం ( Gambhiraopet )గోరంటాల గ్రామానికి చెందిన గొల్లపల్లి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్ ప్రమాదంలో చనిపోగా ఎల్లయ్య కి సంబంధించిన బందువులు రోడ్ ప్రమాదం చేసిన వ్యక్తి నుండి నష్ట పరిహారం పోలీసులు ఇప్పించాలని గోరంటాల బస్టాండ్ వద్ద రోడ్డుపై కూర్చుని ప్రజ రవాణాకు ఇబ్బంది కలిగిస్తూ పోలీసు వారు చెప్పిన వినకుండా ఇబ్బందులు గురిచేసినా కుమిరిశెట్టి మహేందర్, మెండే సుమన్, అలివేలి మురళి, శనిగరపు ముత్తయ్య, అలి వెలి లక్ష్మయ్య , దండవేని మురళి అనే ఆరుగురు వ్యక్తులు పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

 Strict Action Will Be Taken If They Come On The Roads In The Name Of Rasta Rokol-TeluguStop.com

వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండా కి చెందిన మమత అనే మహిళ ఆత్మహత్యా చేసుకొని చనిపోగా మమత కి సంబంధించిన కుటుంబ సభ్యులు మమత మరణానికి గోలియనాయక్ తండా )కి చెందిన సతీష్ కారణం అని పోలీస్ వారికి పిర్యాదు చేయకుండా సతీష్ ఇంటి పై దాడి చేసిన 10 మంది పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ముందు వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు తండాలో చనిపోయిన మమతకు న్యాయం జరగాలని పోలీసులకు పిటిషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా రోడ్ పై కూర్చుని ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగిస్తూ పోలీసు వారు చెప్పిన వినకుండా ఇబ్బందులు గురిచేసినా 05 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో వివిధ సందర్భాల్లో చనిపోయిన వారికి సంబంధించిన బందువులు ఏమైనా నష్టపరిహారం పోలీసులు ఇప్పించాలని రోడ్ల పై కూర్చుని ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ ప్రజ రవాణాకు ఇబ్బంది కలిగిస్తూ పోలీసు వారు చెప్పిన వినకుండా ఇబ్బందులు గురిచేసినా వారిపై జిల్లాలో ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 09 కేసులలో 52 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు.ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పిర్యాదు చేయాలని, అట్టి సమస్యపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

చట్టాన్ని తమ చేతులోనికి తీసుకుని రోడ్ల మీదకు వచ్చి సామాన్య ప్రజానీకానికి,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠిన వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube