మానకొండూర్ ఎమ్మెల్యేగా రసమయన్న హ్యాట్రిక్ విజయం ఖాయం: జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా: మానకొండూర్ ఎమ్మెల్యే గా రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు.ఇల్లంతకుంట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన బీజేపీ మండల అధికార ప్రతినిది దారవేని తిరుపతి బీఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

 Rasamai Hat-trick Victory As Manakondur Mla Zilla Parishad Vice Chairman Siddha-TeluguStop.com

అనంతరం ఇంటింటికి బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పగటి వేషాలు వేసుకుని కొత్తబిచ్చగాళ్ల మాదిరిగా ఊర్లలోకి వస్తున్నారని, అరవై ఏళ్లలో ఇవ్వని హామీలు బీజేపీ ఇప్పుడు ఒక్క చాన్స్ అంటూ ప్రజల్లోకి వస్తున్నారని పేర్కొన్నారు.

బీజేపీ పార్టీ తెలంగాణ లో భూస్థాపితం అయిందని, బీజేపీ నాయకులకే భరోసా లేదని ఇక ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వస్తారన్నారు.తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడవ సారి కూడా భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రాబోతుందని పేర్కొన్నారు.

మానకొండూర్ ఎమ్మెల్యే గా రసమయి బాలకిషన్ గారిని అధిక మెజారిటీ తో గెలిపించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతలపెల్లి తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ గోజాగని కిషన్, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బుర్ర సూర్య గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు మరిజ మోహన్ రావు, నాయకులు బుర్ర స్వామి చరణ్ గౌడ్, బోరాగని మోహన్ రావు, మల్లేశం, శ్రీనివాస్ ,లచిరెడ్డి, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube