గత కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఆరా మస్తాన్ పేరు మారుమోగుతూ వచ్చింది.దీనికి కారణం ఆరా సంస్థ( Aura Company ) చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ ఏపీలో అధికారం చేపడుతుందని చెప్పడమే కారణం.
ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి.కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసిపి అధికారంలోకి వస్తుందని, 94 నుంచి 14 అసెంబ్లీ స్థానాలు వస్తాయని , 13 నుంచి 14 లోక్ సభ స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని ఆరా మస్తాన్ ప్రకటించారు.
విపక్ష కూటమికి 71 నుంచి 81 స్థానాలు , 10 నుంచి 12 లోక్ సభ స్థానాలు వస్తాయని అంచనా వేశారు .రెండు శాతం మాత్రమే ఇద్దరి మధ్య తేడా ఉంటుందని ప్రకటించారు.ఈరోజు కౌంటింగ్ ప్రారంభమైన తరువాత కూడా ఆరా మస్తాన్ అనేక టీవీ ఛానళ్ళ డిబేట్ లో పాల్గొని తాను చెప్పిందే జరుగుతుందని, అది జరగకపోతే తాను ఇకపై సర్వేలే చేపట్టను అని ప్రకటించారు.అయితే ఎవరూ ఊహించని విధంగా టిడిపి, జనసేన, బిజెపి కోటమికి అత్యధిక స్థానాలు దక్కి వైసిపి ( YCP )ఘోర పరాజయం చెందింది.
![Telugu Aara Exit, Ap, Ara Mastan, Ara Masthan, Janasena, Janasenani, Ysrcp-Polit Telugu Aara Exit, Ap, Ara Mastan, Ara Masthan, Janasena, Janasenani, Ysrcp-Polit](https://telugustop.com/wp-content/uploads/2024/06/Ara-Mastan-called-nowd.jpg)
ఆరా మస్తాన్ వైసిపి గెలుస్తుందని లెక్కలతో సహా చూపించడంతో , వైసీపీ అభిమానులు కౌంటింగ్ ముందే గెలుపు సంబరాలు చేసుకున్నారు.చాలామంది పెద్ద ఎత్తున బెట్టింగులకు దిగారు .వైసిపి గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగులు కాశారు.కానీ పరిస్థితి తారుమారు అయింది.
ఇక వైసిపి సైతం విశాఖలో ప్రమాణ స్వీకారానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంది.జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండబోతుందని ముందుగానే హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసి ఉంచారు.
అయితే ఈ ఎన్నికల ఫలితాలలో ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి.గత నాలుగు పర్యాయాలుగా ఎన్నికల్లో ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది.
ఎప్పుడూ అంచనాను తప్పలేదు.
![Telugu Aara Exit, Ap, Ara Mastan, Ara Masthan, Janasena, Janasenani, Ysrcp-Polit Telugu Aara Exit, Ap, Ara Mastan, Ara Masthan, Janasena, Janasenani, Ysrcp-Polit](https://telugustop.com/wp-content/uploads/2024/06/Ara-Mastan-called-nowe.jpg)
అయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో మాత్రం ఆరా ఎగ్జిట్ పోల్స్ ( Aura exit polls )కు ఫలితాలకు సంబంధం లేదన్నట్లుగానే ఫలితాలు విడుదలయ్యాయి .దీంతో ఆరా మస్తాన్ మరోసారి మీడియా, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు.ఆరా మస్తాన్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో ఆయనపై వైసీపీ శ్రేణులు విమర్శలకు దిగుతున్నారు.