ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిపే ఆడియో, విడియో సీడీ ఆవిష్కరనలో కలెక్టర్,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు( Right to Vote )ను సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని కలెక్టర్,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.“ఓటేద్దాం…రండి!” అనే పేరుతో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ… రూపొందించిన పాటల ఆడియో విడియో సిడినీ బుధవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్( Collector Anurag jayanthi ) ఆవిష్కరించారు.జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారధి సంయుక్త ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆడియో, విడియో సాంగ్ ను రూపొందించారు.
స్వీప్ సౌజన్యంతో జిల్లా పౌర సంబంధాలు అధికారి మామిండ్ల దశరథం పర్యవేక్షణలో ఈ పాటల సిడినీ రూపొందించారు.

 Collector Anurag Jayanthi Launches Right To Vote Audio And Video Cd,collector An-TeluguStop.com

సిడి లోని పాటలను గడ్డం శ్రీనివాస్ రచించి స్వరకల్పన చేయగా గణేష్ పాడారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని అన్నారు.

మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉందని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు.

ఈ సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాలు అధికారి మామిండ్ల దశరథం, అదనపు డి ఆర్ డి ఒ ,స్వీప్ నోడల్ అధికారి కూర నర్సింహులు, తెలంగాణ సాంస్కృతిక సారథి గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube