ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిపే ఆడియో, విడియో సీడీ ఆవిష్కరనలో కలెక్టర్,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు( Right To Vote )ను సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని కలెక్టర్,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

"ఓటేద్దాం.రండి!" అనే పేరుతో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.

రూపొందించిన పాటల ఆడియో విడియో సిడినీ బుధవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్( Collector Anurag Jayanthi ) ఆవిష్కరించారు.

జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారధి సంయుక్త ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆడియో, విడియో సాంగ్ ను రూపొందించారు.

స్వీప్ సౌజన్యంతో జిల్లా పౌర సంబంధాలు అధికారి మామిండ్ల దశరథం పర్యవేక్షణలో ఈ పాటల సిడినీ రూపొందించారు.

సిడి లోని పాటలను గడ్డం శ్రీనివాస్ రచించి స్వరకల్పన చేయగా గణేష్ పాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని అన్నారు.

మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉందని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు.

ఈ సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాలు అధికారి మామిండ్ల దశరథం, అదనపు డి ఆర్ డి ఒ ,స్వీప్ నోడల్ అధికారి కూర నర్సింహులు, తెలంగాణ సాంస్కృతిక సారథి గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .

వైరల్ వీడియో: వీధులలో నివసిస్తున్న మహిళకి ఊహించలేని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్..