ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన, జిల్లా వైద్యఅధికారి

రాజన్నసిరిసిల్ల జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.వసంత రావు , జాతీయ కీటక నియంత్రణ అధికారి డాక్టర్ రాజగోపాల్ లు ఎల్లారెడ్డిపేట , వీర్నపల్లి మండలాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు.

 The District Medical Officer Made A Surprise Visit To The Health Sub-centres, He-TeluguStop.com

డ్రై డే కార్యక్రమము ఏ విధంగా నిర్వహిస్తున్నారని ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని , వర్షపు నీరు , మురికి నీరు నిల్వలు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని , దోమ తెరలు వాడాలని తెలిపారు.

ఉపయోగించని కుండలు , టైర్లు , సీసాలు , కుండీలు , నీటి తొట్టీలు , కొబ్బరి చిప్పలు , కూలర్లు వంటి వాటిలో నీటి నిల్వలు ఉండకుండా ప్రతి రెండు , మూడు రోజుల కొకసారి శుభ్ర పరుచుకోవాలని అన్నారు.వర్షాకాలంలో ప్రజలందరు కాచి చల్లార్చి వడబోసిన నీటిని మాత్రమే త్రాగాలని , వండిన పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినాలని , ఎవరైనా జ్వరముతో బాధపడే వాళ్లు తప్పకుండా సంభందిత ఆరోగ్య కేంద్రము లో రక్తపరీక్షలు చేయించుకోవాలను కోరారు.

వాంతులు , విరేచనాలతో బాధపడే వాళ్లు తప్పకుండా ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించాలని సీజనల్ వ్యాధుల పట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.వీర్ణపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి సంభందించిన గజ్జెల నయనశ్రీ 6 సంవత్సరాల నయనశ్రీ నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నందున కలెక్టర్ ఆదేశాల మేరకు పాప యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకొన్న డిఏం అండ్ హెచ్ఓ తానే స్వయంగా సందర్శించి హైదరాబాద్ లోని స్పెషలిస్ట్ వైద్యులతో పాపకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.

జాతీయ.కీటక నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజగోపాల్ వీర్ణపల్లి మండలం లోని కస్తూర్బా పాఠశాల ను సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తి గత శుభ్రతను పాటించాలని అక్కడి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు , ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజగోపాల్ లతో పాటు ఇంచార్జీ మండల వైద్యాధికారులు డాక్టర్ స్రవంతి , చిరంజీవి , కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లు బాలచందర్ , ఆంజనేయులు , పిహెచ్ఎన్ రజని , సూపర్ వైజర్ పద్మ , వైద్య సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube