సినిమా పరిశ్రమ అనేది ఓ మాయాజాలం.ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.
అందులో కొన్ని మంచి కలిగించే అంశాలు ఉంటే.మరికొన్ని కోలు కోలేని దెబ్బకొట్టే విషయాలుంటాయి.
ఒకప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎంఎస్ రాజు.అగ్ర నిర్మాతగా రాజు ఎన్నో అద్భుత సినిమాలు నిర్మించాడు.
తను నిర్మించిన ఓ సినిమాను మాత్రం జీవితంలో మర్చిపోలేను అంటారాయన.ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆయన ఎందుకు అలా అన్నారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
రాజు నిర్మించిన సినిమా మనసంతా నువ్వే.ఈ సినిమాకు 19 ఏండ్లు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా ఆయన తన సినిమా అనుభవాలను పంచుకున్నారు.సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
మనసంతా నువ్వే సినిమా కంటే ముందుగా రాజు వెంకటేష్‌తో దేవీపుత్రుడు అనే సినిమా తీశాడు.దీనికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా తన జీవితంలో కోలుకోలేని దెబ్బకొట్టిందని చెప్పారు రాజు.ఈ సినిమా దెబ్బకు 14 కోట్ల రూపాయల నష్టం కలిగిందని చెప్పారు.
ఈ సినిమా నుంచి వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పారు రాజు.ఈ సినిమా తర్వాత 1.30 కోట్ల రూపాయల బడ్జెట్ తో మనసంతా నువ్వే సినిమా తీశారు.సొంతంగా రిలీజ్ చేసుకున్నారు.
ఈ సినిమా ఓ రేంజిలో ఆడింది.కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు రాబట్టింది.ఆ రోజుల్లోనే ఈ సినిమా 16 కోట్ల రూపాయాలకు పైగా వసూళ్లను కలెక్ట్ చేసింది.దేవిపుత్రుడు దెబ్బతో తీవ్ర ఇబ్బందులు పడిన ఆయన ఈ సినిమాతో కాస్త కోలుకున్నాడు.
ఈ సినిమా తర్వవాత మహేష్ బాబు- గుణ శేఖర్ కాంబినేషనలో ఒక్కడు సినిమా నిర్మించాడు.ఈ సినిమా సైతం ఓ రేంజిలో విజయం సాధించింది.ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో కలిసి వర్షం సినిమా నిర్మించాడు.ఈ సినిమా మూలంగా తన దశ తిరిగింది అన్నారు ఎంఎస్ రాజు.