రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) సింగారం గ్రామంలో ఈనెల 15న రాత్రి జరిగే ఉత్సవాలకు రావాలని సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కు శనివారం నిర్వాహకులు షేక్ అజిజ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు, సింగారం గ్రామస్తులు ఆహ్వాన పత్రికను అందించారు.ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం ( Telangana State )నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిమంది భక్తులు హాజరవుతారు.
ఈ ఉత్సవాలలో కవ్వాలి కార్యక్రమాలతోపాటు వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది.కుల, మతాలకతీతంగా గుట్టపై వెలసిన సయ్యద్ దుర్వేషావలి దర్గాను సందర్శించుకుని తమ మొక్కులను భక్తులు చెల్లించుకుంటారు.
ఈ కార్యక్రమానికి పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకతీతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని నిర్వాకులు షేక్ అజిస్ కోరారు.వినతి పత్రం సమర్పించిన వారిలో ఎల్లారెడ్డిపేట మండలం ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్ షాదుల్లా, ఎల్లారెడ్డిపేట మసీద్ కమిటీ అధ్యక్షుడు జహంగీర్, ఉపాధ్యక్షులు లాల్ మొహమ్మద్, కోశాధికారి అహమ్మద్, ప్రధాన కార్యదర్శి వాజిద్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ అహ్మద్, రఫీక్, ఆప్షన్ సభ్యుడు జబ్బర్, సింగారం ఉపసర్పంచ్ ఉస్మాన్, మహబూబ్, షేక్ గౌసోద్దీన్, ముజాఫర్, టిఆర్ఎస్ నాయకులు మంగోలి శ్రీనివాస్ గౌడ్, గొరిటాల శ్రీనివాస్, వాసర వేణి దేవరాజులు పాల్గొన్నారు.