మరో పోస్ట్ తో అడ్డంగా దొరికిపోయిన శోభిత... చైతన్యతో రిలేషన్ లో ఉన్నట్టేనా?

శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala ) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు.టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని తేడా లేకుండా సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

 Sobhita Dhulipala Latest Post Goes Viral In Social Media Details, Sobhita, Nagac-TeluguStop.com

ఇక ఈమె బాలీవుడ్ మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఈమె నటించిన మంకీ మాన్( Monkey Man ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 26 తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇలా కెరియర్ పరంగా శోభిత ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఈమె గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.

శోభిత అక్కినేని హీరో నటుడు నాగచైతన్యతో( Naga Chaitanya ) రిలేషన్ లో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.వీరిద్దరూ కలిసి లండన్ లోని ఒక రెస్టారెంట్లో కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరాయి.ఇలా వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉన్నప్పటికీ ఈ విషయంపై వీరిద్దరూ ఎక్కడ పరోక్షంగా స్పందించిన దాఖలాలు లేవు కానీ ఈ రూమర్లను ఖండించను కూడా లేదు.

ఇక ఇటీవల కాలంలో వీరిద్దరి గురించి వస్తున్నటువంటి రూమర్లు మరింత ఎక్కువగా అయ్యాయి.అయితే తాజాగా శోభిత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారడంతో మరోసారి వీరిద్దరీ రిలేషన్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్( Chai ), అండ్ దట్స్ ఓకే.అని రాసుకొచ్చింది.దానికి అర్థం.

నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు.అని రాసుకోచ్చారు.

సాధారణంగా ఎవరైనా టీ గురించి రాసుకు వస్తే వన్ కప్ ఆఫ్ టీ అని రాసుకొస్తారు.కానీ ఈమె మాత్రం Chai అని రాయడంతో టీ గురించి చెప్పిందా లేకపోతే పరోక్షంగా చైతన్య గురించి చెబుతూ ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ పెద్ద ఎత్తున ఈమె చేసిన పోస్ట్ పై నేటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube