ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఒకవైపు కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర సినిమా( Devara ) షూటింగ్ పనులలో ఈయన బిజీగా ఉంటున్నారు మరోవైపు బాలీవుడ్ చిత్రం వార్ 2( War 2 ) సినిమా షూటింగ్ పనులలో కూడా ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

 Ntr And Prashanth Neel Movie Update On Ntr Birthday Fans Waiting Details, Prasha-TeluguStop.com

ఇలా బాలీవుడ్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఈయన తరచూ హైదరాబాద్ ముంబై వెళ్లడంతో ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Devara, Ntr, Koratala Shiva, Ntr Ups, Prashant Neel, War-Movie

ఇకపోతే ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ మే 21వ తేదీ పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నారు.ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఒక కార్యక్రమంలో కొరటాల శివ పాల్గొనగా ఆయనని అభిమానులు దేవర సినిమా నుంచి అప్డేట్ కావాలని కోరారు.

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) సందర్భంగా బాలీవుడ్ సినిమా నుంచి ఖచ్చితంగా ఒక పోస్టర్ అయిన రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Telugu Devara, Ntr, Koratala Shiva, Ntr Ups, Prashant Neel, War-Movie

ఇది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా అదే రోజు విడుదల కాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.ఎన్టీఆర్ కొరటాల శివ మాత్రమే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో కూడా పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాని అధికారకంగా ప్రకటించారు కానీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయలేదు.అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కానీ లేదా పూజా కార్యక్రమాలు కానీ జరుగుతాయని అభిమానులు భావిస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

మరి ఎన్టీఆర్ పుట్టినరోజున వరుస అప్డేట్లతో మేకర్స్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube