రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళితబంధు పెండింగ్ యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఇల్లంతకుంట, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఫామ్ ఆయిల్ పంట సాగు, దళిత బంధు, స్వచ్ఛ సర్వేక్షణ్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
దళిత బంధు యూనిట్లకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ లను సబ్మిట్ చేసి యూనిట్ల గ్రౌండింగ్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు సూచించారు.గ్రౌండింగ్ అయిన యూనిట్ల వివరాలను మొబైల్ అప్లికేషన్లో అప్ లోడ్ చేయాలన్నారు.
పాడి గేదెల డైరీ యూనిట్ లకు సంబంధించి లబ్దిదారుల నుండి కన్సెంట్ తీసుకుని యూనిట్ ల గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.రైతులను చైతన్యం చేసి జిల్లాలో నిర్దేశించి న లక్ష్యం మించి ఆయిల్ పామ్ పంట సాగు అయ్యేలా చూడాలన్నారు.
మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీపీఓ రవీందర్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారిణి జ్యోతి, అడిషనల్ డీఆర్డీఓ మదన్ మోహన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లిఖార్జున్, ఎంపీడీఓ లు, తదితరులు పాల్గొన్నారు.