రాజన్న సిరిసిల్ల జిల్లా 17 వపోలీస్ బెటాలియన్ కార్యాలయం సర్దాపూర్ లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి సిబ్బంది అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ.జయప్రకాశ్ నారాయణ, యమ్.పార్థసారథి రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శైలజ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







