టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కొత్తగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.గత నెలలో మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు.
అందులో మెగా 157 ఒకటి.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా అదిరిపోయింది.

ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి( Director Vasishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ మెగాస్టార్ తో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీయబోతున్నట్టు తెలుస్తుంది.పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.
అలాగే ఈసారి ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ కంపెనీ పని చేయనుందని సమాచారం.
కాగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
ఇది పక్కన పెడితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి తాజాగా నెట్టింట ఒక న్యూస్ వైరల్ అవుతుంది.అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోనున్న ఈ సినిమాలో హీరోయిన్ గురించి తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా అనుష్క శెట్టిని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు టాక్.
మెగాస్టార్ కూడా అనుష్క( Anushka Shetty ) విషయంలో పాజిటివ్ గానే ఉన్నారని దీంతో మేకర్స్ ఆమెను ఒప్పించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.
మరి అనుష్క కూడా ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాలో రోల్ కు ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.







