ఇటీవల కాలంలో చాలా మంది అందంగా కనిపించేందుకు మేకప్ పై ఆధార పడుతున్నారు.కొందరైతే మేకప్ లేకుండా బయట కాలు పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను గనుక పాటిస్తే మేకప్ అక్కర్లేదు సహజంగానే అందంగా మరియు కాంతి వంతంగా మెరిసిపోవడం ఖాయం.ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటి అన్నది తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక ఎగ్ ను తీసుకుని బ్రేక్ చేసి ఎల్లో మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ గుడ్డు పచ్చ సొనలో వన్ టేబుల్ స్పూన్ నీరు తొలగించిన పెరుగును వేసి బాగా మిక్స్ చేయాలి.
చివరిగా వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.
ఐదు నిమిషాల పాటు ఆరిన తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని మళ్లీ ఒక సారి అప్లై చేసుకోవాలి.చర్మం పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేచి ఉండి అప్పుడు నార్మల్ వాటర్ తో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఆపై ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే ముఖం సహజంగానే అందంగా మరియు కాంతివంతంగా మారుతుంది.