కరోనా కష్టకాలం తరువాత నిత్యావసర వస్తువులకు దారుణమైన డిమాండ్ ఏర్పడింది.ఈ క్రమంలో ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగి సామాన్యుడి నడ్డి విరిచాయి.
ఇంధన ఆయిల్స్ అయినటువంటి పెట్రోల్, డీసెల్ ధరలు ఆకాశాన్నంటడంతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ముగ్గు చూపారు.ఈ తరుణంలో దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
దానివలన రోజుకో కొత్త ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లోకి విడుదలవుతోంది.ఇక ప్రభుత్వం కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కాస్త మక్కువ చూపుతోంది.
అయితే ఈ వెహికల్స్ ధరలు కూడా భారీగానే ఉండటం చేత సామాన్యులకు కొనడం కాస్త భారంగా మారింది.ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని సదరు కంపెనీలకు కొంత సబ్సిడీ ఇస్తున్నప్పటికీ నేడు ప్రతి వస్తువుపై పెరిగిపోతున్న ధరలు కారణంగా కంపెనీలు కూడా వెనక్కి తగ్గడం లేదు.
ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు బడ్జెట్ రేటులోనే వాహనాలు అందిస్తున్నాయి.ఇక్కడ ముందుగా Raftaar Electrica గురించి చెప్పుకోవాలి.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 50 వేల రూపాయల కంటే తక్కువే.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.48,540.బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటకు 100 కి.మీ.వరకు ప్రయాణించవచ్చు.

రెండవ వాహనం Crayon Zeez.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర కూడా 48 వేల రూపాయలు.శక్తివంతమైన 250W మోటార్‌తో వస్తున్న ఈ EV , గరిష్ట వేగం గంటకు 25 కి.మీ.తిరుగుతుంది.అలాగే మూడవ వాహనాన్ని చూసుకుంటే Bounce Infinity E1.ఈ ఇన్ఫినిటీ E1 ఇ-స్కూటర్ ధర రూ.45,099 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.నాల్గవది Avon E-SCOOT 504.ఇది దాదాపు 45 వేల రూపాయలు ఉంటుంది.ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.చివరగా ఐదవది Komaki X1.Komaki స్కూటర్లు రూ.50,000 లోపే వస్తున్నాయి.ఇవి గంటకు 85 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.ఇంకా పూర్తి వివరాలకు సంబంధిత సైట్స్ సంప్రదించండి.







