రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఉన్న శ్రీ దుర్గా మాత కు శనివారం అభిషేకం, కుంకుమ పూజ ప్రత్యేక పూజలు పురోహితులు రాచర్ల కృష్ణ మూర్తి శర్మ కన్నుల పండువగా నిర్వహించారు.
శ్రీ దుర్గా మాత ఆలయంలో ఆలయ కమిటీ వారు మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాల్గొన్న భక్తకోటికి తీర్థప్రసాదం అన్న ప్రసాదం వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నంది కిషన్, దుంపెన రమేష్, బాల్ రెడ్డి, రావుల లింగారెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి , శ్రీ దుర్గా మాత ఆలయం కమిటీ మహిళా సభ్యులు తదితరులు పాల్గొని వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.