Harish Rao : అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్..: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు( Former minister Harish Rao ) స్పందించారు.కొండంత ఆశలు పెట్టి గోరంత కూడా చేయలేని బడ్జెట్ ఇదని విమర్శించారు.

 Budget To Encourage Food Donors Harish Rao-TeluguStop.com

అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్ ఉందన్నారు.రైతులకు నామమాత్రంగా కేటాయింపులు చేశారని మండిపడ్డారు.

రైతుబంధు, రుణమాఫీకి రాంరాం చెప్పేలా బడ్జెట్ పెట్టారని పేర్కొన్నారు.వ్యవసాయ రంగానికి సంబంధించి రూ.87 వేల కోట్లు అవసరమన్న హరీశ్ రావు బడ్జెట్ లో పెట్టింది రూ.19,746 కోట్లని తెలిపారు.

ఈ నిధులు ఎక్కడా సరిపోవన్నారు.రైతులను దగా చేశారన్న హరీశ్ రావు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని పేర్కొన్నారు.ప్రజా పాలన, 24 గంటల కరెంట్ పై అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు.ప్రస్తుతం ఎక్కడా కూడా 14 లేదా 15 గంటలకు మించి కరెంట్ రావడం లేదన్నారు.

కేసీఆర్ రైతులను రాజులను చేస్తే కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube