రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినిపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామం జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు సోమవారం స్వచ్ఛదనం – పచ్చదనం( Swachadanam – Pachadanam )పై అవగాహన కల్పించేందుకు ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల నివారణకు పాటుపడాలని,ప్రతి ఒక్కరూ గ్రామంలో చెట్లు నాటి కాలుష్య నివారణ,పచ్చని వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు.