సాధారణంగా ఒక్కోసారి నీరసం పట్టుకుందంటే వదలదు.నీరసం కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.
తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.అయితే నీరసాన్ని పోగొట్టి శరీరానికి బలాన్ని ఇచ్చే బలమైన లడ్డూ ఒకటి ఉంది.
ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.మరి ఇంకెందుకు లేటు ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఫూల్ మఖానా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి.అదే పాన్ లో అర కప్పు నువ్వులు, అర కప్పు గుమ్మడి గింజలు, అర కప్పు అవిసె గింజలు ( Flax seeds )వేసుకుని విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.
ఇవి చల్లారే లోపు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నల్ల ఎండు ద్రాక్ష, రెండు టేబుల్ స్పూన్లు మామూలు ఎండు ద్రాక్ష వేసి వాటర్ తో వాష్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఫూల్ మఖానా, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు వేసుకుని బరకగా పొడి చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో ఐదు నుంచి ఆరు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు కడిగి పెట్టుకున్న ఎండు ద్రాక్ష వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.ఈ లడ్డూను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ లడ్డూ ఎంతో రుచికరంగా ఉంటుంది.

అలాగే ఈ లడ్డూ లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూను తీసుకుంటే ఎలాంటి నీరసమైన పరారవుతుంది.శరీరానికి బోలెడంత బలాన్ని చేకూరుస్తుంది.అలాగే ఈ లడ్డూ ఐరన్ కొరతకు చెక్ పెడుతుంది.రక్తహీనతను తరిమి కొడుతుంది.ఎముకలను బలోపేతం చేస్తుంది.
జుట్టు రాలే సమస్యను అడ్డుకుంటుంది.మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారికి కూడా ఈ లడ్డూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది ఒక ఎనర్జీ పోస్టర్ గా పనిచేస్తుంది.







