రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం ఈ నెల 17న పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ కెసిఆర్ జన్మదినం రోజున సందర్భంగా మూడు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు తెలిపారు.ఇందులో భాగంగా శుక్రవారం వేములవాడలోని తన స్వగృహంలో వృక్షార్చన పోస్టర్ ను ఆవిష్కరించారు.
రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగంగా మార్చాలని సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, నాటిన మొక్కతో సెల్ఫీ దిగి 9000365000 నెంబర్ కు వాట్సప్ చేయాలని తెలిపారు.ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
వారి తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.







