మహిళా జడ్జిపై చెప్పు విసరడాన్ని నిరసిస్తూ విధుల బహిష్కరణ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ సెషన్స్ జడ్జి హరిష పై కరణ్ సింగ్ అనే నిందితుడు చెప్పు విసరడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించినట్లు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు.శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు ప్రధాన ద్వారం ముందు నిరసన తెలిపారు.

 Boycott Of Duties To Protest The Throwing Of A Shoe On A Female Judge, Boycott O-TeluguStop.com

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ ఫోక్సో కేసులో కరణ్ సింగ్ అనే నిందితుడికి జీవిత ఖైదు విధించిన జడ్జిపై చెప్పు విసరడం అత్యంత బాధాకరమని, న్యాయ సూత్రాల ప్రకారం తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై దాడులకు పాడ్పడడం అత్యంత హేయమైన చర్య అని, న్యాయమూర్తులకు న్యాయవాదులుగా అండగా ఉంటామని, ఈ చర్యని నిరసిస్తూ విధులు బహిష్కరించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజినీకాంత్, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్ గౌడ్, రేగుల దేవేందర్, వేముల సుధాకర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, పెంటరాజు, గొంటి శంకర్, పిల్లి మధు, కటకం జనార్ధన్, బీమా మహేష్, మాదాసు దేవయ్య, తాహెర్ పాషా, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube