వేములవాడ అర్బన్ మండల – నియోజకవర్గం నుండి 2500 మంది జన సమీకరణ.గురువారం కరీంనగర్ లో జరిగే అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ , పిసిసి జనరల్ సెక్రెటరీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ భేతి సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు.
వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల, సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా వారు ఇచ్చిన సందేశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసే క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్ర మహబూబబాద్, వరంగల్ పార్లమెంట్ లో ముగించుకొని కరీంనగర్ పార్లమెంటులోని ఆరు నియోజకవర్గాలలో పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి ఈనెల 9న అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను పురస్కరించుకొని నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి అంబేద్కర్ స్టేడియం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
ఈ బహిరంగ సభకు ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు.