Roasted chicken : కాల్చిన చికెన్ తినేవారికి ఈ భయంకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉందా..

ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మాంసాహారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.ఇంకా చెప్పాలంటే దాదాపుగా మాంసం తినేవారు భూమి మీద ఎవరు ఉండరేమో అనంతగా మారిపోయింది.

 Is It Possible For People Who Eat Roasted Chicken To Get This Terrible Disease,-TeluguStop.com

అందులోనూ చికెన్ అంటే ఎంతో ఇష్టపడని వారు ఎవరు ఉండరు.అయితే ఈ చికెన్ వంటకాలు ఎక్కువగా తినే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తెలిసింది.

కానీ మంటపై లేదా నిప్పులపై కాల్చి తింటే మాత్రం భయంకరమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి మాంసాన్ని ఎక్కువగా తింటే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది.

అయితే బాగా కాల్చిన చికెన్ ను ఎక్కువగా తినేవారు, తినని వారిపై అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసిన దాని ప్రకారం కాల్చిన మాంసం తినని వారితో పోలిస్తే తినే వారిలో 60% ఎక్కువ మందికి భయంకరమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలుసుకున్నారు.

మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దానిపై పొర మీద క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

ఇంకా చెప్పాలంటే బాడీ బిల్డర్లలో శరీర కండరాలు పెరిగేందుకు దోహదపడే క్రియాటిన్ ఆర్గానిక్ యాసిడ్ ఇది.అధికమంట మీద వేడి చేసినప్పుడు సైక్లిక్ అమైన్ అనే క్యాన్సర్ కారకంగా మారే అవకాశం ఉంది.అయితే ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలి.ఈ మాంసాన్ని బార్బిక్యూ లేదా తందూరి పద్ధతిలో వండుకోవాలని అనుకున్నప్పుడు దాన్ని మెరినెట్ చేసి ఉంచాలి.

నిప్పులపై కాల్చడానికి 30 నిమిషాల ముందు మేరినేషన్ లో ఉంచాలి.ఇలా చేయడం వల్ల మాంసం రుచిగా ఉండడంతో పాటు ఆ మెరినేషన్ మాంసానికి నిప్పులా వేడికి మధ్య అడ్డుగోలుగా ఉంటుంది.

నిప్పులా మంట నేరుగా మాంసానికి తగలకపోవడం వల్ల క్యాన్సర్ కారకాలు ఏర్పడినందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube