రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనాలు రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో బుధవారం బద్ది పోచమ్మ అమ్మవారికి అత్యంత వైభవంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఫోక్ ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి కళాకారులు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా నిలిచే బోనాలను
డబ్బు చప్పులతో తీన్మార్ స్టెప్పులతో అమ్మవారికి బోనాల ఊరేగింపు నిర్వహించారు.
బోనాల సందర్భంగా యూట్యూబ్ కళాకారిణి, కళాకారుల రాకతో పట్టణంలో పండగ వాతావరణం సంతరించుకుంది.దింతో యూట్యూబ్ కళాకారులను చూసేందుకు పట్టణ ప్రజలు, యువత ఆసక్తి కనబరిచారు.
ఈ కార్యక్రమంలో యూట్యూబ్ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







