పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రం లో త్వరలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్,మెదక్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సభ్యులైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య పటేల్, పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ పటేల్ లకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.

 Bc Candidates In Graduate Mlc Elections, Bc Candidates ,graduate Mlc Elections,-TeluguStop.com

జిల్లా అధ్యక్షులు అందరికి మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ ఓటరు లిస్టులను ఇవ్వటం జరగింది,

అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించడం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు వొంటెల రత్నాకర్ పటేల్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి బొరిగాం రాజారాం, మెదక్ జిల్లా అధ్యక్షులు బట్టి ఉదయకుమార్, కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరి శంకర్ పటేల్ , తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాడేం రంజిత కృష్ణ మూర్తి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మలకరామస్వామి పటేల్, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్ , నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి గాండ్ల లింగం , రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు బోప్ప దేవయ్య లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు గుర్రం ఆంజనేయులు కొట్టె మహేష్ పటేల్ పాటుగా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube