రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు.జాతీయ రహదారి 368B సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు ప్రపోజల్‌ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని విజ్ఞప్తి.
విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు – వేములవాడ, కొండగట్టు, ధర్మపురి – మరింత అనుసంధానమవుతాయి.అలాగే, నేషనల్ హైవే 63కి అనుసంధానం కలుగుతుంది.
గతంలోనే ఈ ప్రతిపాదనలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
మానేరు నదిపై రోడ్డు-కమ్-రైల్ బ్రిడ్జి నిర్మించాలని గడ్కరీని కోరిన కేటీఆర్ బృందం.
ఈ ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలియజేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు.కేంద్రమంత్రిని కలిసిన బృందంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి తదితరులు ఉన్నారు.







