రాజన్న సిరిసిల్ల జిల్లా బీ వై నగర్ 30 వార్డు హనుమాన్ మందిర్ వార్షికోత్సవంలో డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ ఆంజనేయస్వామి సాక్షాత్ శివ స్వరూపం చిరంజీవి త్రి త్రేతాయుగంలోనూ, రామునికి సేవలు అందించిన రామ్ బంటుగా ద్వాపర యుగంలో అర్జునుని రథం పై పతాకంలో తాను ఉండి విజయాన్ని చేకూర్చి పెడతాడు.ధర్మరక్షణకై నిలిచినటువంటి మానవుల మానసిక భయాన్ని దూరం చేసేవారే వీరాంజనేయ స్వామి అన్నారు.
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య విశేష సీనియర్ సిటిజెన్ సేవలను పురస్కరించుకొని ఘనంగా షాలువాతో సత్కరించారు.
ఇదే రోజు డాక్టర్ జనపాల పుట్టినరోజు కావడం విశేషంగా భావించవచ్చు.
సీనియర్ సిటిజన్ ముఖ్య సలహాదారు కోడం నారాయణ ని కూడా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ సిటిజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య, ఉపాధ్యక్షులు శ్రీగాధ మైసయ్య, కోశాధికారి దుంత దేవదాసు, గౌరిశెట్టి ఆనందం, గజ్జెల్లి రామచంద్రం గుడి అధ్యక్షులు, నల్ల సత్యనారాయణ, ఆలయ కమిటీ సీనియర్ సిటిజన్ అందరూ సుమారు 100 మంది దాకా భక్తులు పాల్గొన్నారు.







