వీర్నపల్లిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల స్థాయి సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా :జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం సూచన మేరకు వీర్నపల్లి మండల అధ్యక్షులు పరమల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం వీర్నపల్లి లో బీసీ ముఖ్య నాయకుల మండల స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం మాట్లాడుతూ బీసీలు నూటికి 60 శాతం ఉన్న విద్య , ఉద్యోగ,రాజకీయాల్లో తమ వాటా తమకు దక్కేవరకు పల్లె పల్లెనా బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి బీసీల హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు.

 National Bc Welfare Association Mandal Level Meeting At Veernapally, National Bc-TeluguStop.com

మన పిల్లల భావితరాలు బాగుండాలంటే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం గ్రామ గ్రామాన బీసీ ఉద్యమం చేపట్టాలన్నారు.

రానున్న రోజుల్లో బీసీలను ఏకతాటిపై తీసుకువచ్చి బీసీలను చైతన్యం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ , జిల్లా కార్యవర్గ సభ్యులు మారవేణి మహేష్, వీర్నపల్లి మండల అధ్యక్షులు పరమల మల్లేశం యాదవ్, మండల యూత్ అధ్యక్షులు దయ్యాల అంజి,ఉపాధ్యక్షులు సిర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జోగిని పెళ్లి మల్లేశం, కార్యదర్శి మాడుగుల చిన్న లింబాద్రి, భూత ప్రశాంత్, కోశాధికారి గోడ చిన్న వెంకటి, అడవిపతిరా కోశాధికారి వెలుగు మహేష్, కార్యవర్గ సభ్యులు దేశరాజు సత్తయ్య, తిరుపతి, బండారి మహేష్, గొడుగు సతీష్, సుంకరి దేవరాజు, సట్ల దేవరాజు, ఏలం బోడ ప్రవీణ్, బూత్ హరీష్, బీసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube