గ్రీన్ టీ.( Green Tea ) మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పానీయాల్లో ఇది ఒకటి.
వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్నవారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఇష్టపడేవారు తప్పకుండా తమ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటారు.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
శరీర బరువును తగ్గించడం నుంచి క్యాన్సర్ నివారణ వరకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అంతేకాదు కేశ సంరక్షణకు( Hair Care ) సైతం గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్ వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి గ్రీన్ టీని వాడొచ్చు.అందుకోసం ముందుగా అర గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని అందులో రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ వేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి,( Hibiscus Powder ) వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి( Amla Powder ) వేసుకోవాలి.
వీటితో పాటు తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ టీ కూడా కొంచెం కొంచెంగా పోసి అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలిక పాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే చాలా ప్రమయోజనాలు పొందుతారు.
ముఖ్యంగా ఈ మాస్క్ జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని, చిట్లడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది.
అలాగే గ్రీన్ టీ, మందారం పొడి, కరివేపాడు, ఉసిరిలో ఉండే పలు విటమిన్లు జుట్టును తేమగా మార్చడంలో సహాయపడతాయి.డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తాయి.
అంతేకాకుండా మీ కురులను షైనీగా మెరిపిస్తాయి.