సీపీఆర్ శిక్షణతో ఎంతోమందికి పునర్జన్మను ఇవ్వవచ్చు

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)పై విస్తృత అవగాహన పెంపొదించుకోవడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చునని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు.శుక్రవారం లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ, సమాచార,పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) పై సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జిల్లాలో నీ జర్నలిస్ట్ లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

 Many People Can Be Revived With Cpr Training , Cpr Training , Cardiopulmonary R-TeluguStop.com

జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీరాములు సీపీఆర్‌ చేయు విధానం పై జర్నలిస్ట్ లకు శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ జీవనశైలి మారడం, ఒత్తిడి తో కూడిన జీవితం వల్ల గతంలో కంటే గుండెపోట్లు పెరిగాయన్నారు.

గుండె పోటు వచ్చినప్పుడు ఏం చేయాలో అవగాహన లేకపోవడం వల్ల గుండె పోటు కు గురైన వారి లో ఎక్కువ మంది చనిపోతున్నారని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని దానాలలో కెల్లా ప్రాణదానం మిన్న అని భావించి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులతో సహా ఇతర ఫ్రంట్ లైన్ ప్రభుత్వ శాఖల సిబ్బందికి, జర్నలిస్ట్ లకు సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

లైఫ్ సేవింగ్ టెక్నిక్ ల ద్వారా అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ గురయ్యే వారి ప్రాణాలను కాపాడుతూ వారి కుటుంబాలకు వెన్నుదన్నుల నిలవాలని డీఎంహెచ్ ఒ సూచించారు.అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం మాట్లాడుతూ.

ప్ర‌జ‌ల యొక్క విలువైన ప్రాణాల‌ను కాపాడ‌ట‌మే సీపీఆర్ ల‌క్ష్యం అన్నారు.ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి లైఫ్ స్టైల్ ,ఆహార‌పు అల‌వాట్లు మారిపోవడం వల్ల, ప‌ని ఒత్తిడి కార‌ణంగా షాక్స్ వ‌స్తున్నాయన్నారు.

క‌రోనా త‌ర్వాత కూడా కార్డియాక్ అరెస్టులు పెరిగాయన్నారు.జర్నలిస్ట్ లు పని ఒత్తిడి తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలన్నారు.

ప్రసార, ప్రింట్ మాధ్యమాల ద్వారా ప్రజలకు సిపిఆర్ ప్రాధాన్యత ను తేలియజెప్పాలన్నారు.అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ మాట్లాడుతూ.

అకస్మత్తుగా గుండె ఆగిన సమయంలో బాధితుల ప్రాణాలు రక్షించేందుకు ఉపయోగపడే సీపీఆర్ శిక్షణ పట్ల జర్నలిస్ట్ లకు తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు టివి నారాయణ, మచ్చ ఆనంద్, ముత్యం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube