రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ లతీఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులను గంభీరావుపేటలోని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు.పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు కొన్ని కొన్ని డబ్బులు సేకరించి వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టిస్తామని పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పారు.
ఈ విషయం కరస్పాండెంట్ లతీఫ్ కు చెప్పగానే 9వ తరగతి విద్యార్థుల మంచి నిర్ణయానికి విద్యార్థులను అభినందించారు.అందులో భాగంగా విద్యార్థులు సందర్శించి వృద్ధులతో కలిసి కాస్త సమయం గడిపారు.
వాళ్లతో కలిసి భోజనం చేసి వృద్ధుల బాగోగులు తెలుసుకొని వాళ్లతో ఆడి పాడి సంతోషంగా గడిపారు.వృద్ధులకు మేమున్నామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లతీఫ్, ప్రిన్సిపాల్ శరత్ కుమార్, డైరెక్టర్ అష్రాఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.