చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ ను గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణపైలోతుగా పరిశీలించారు.విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

 Sp Akhil Mahajan Inspected Chandurthi Police Station, Sp Akhil Mahajan ,chandurt-TeluguStop.com

మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు.పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని,సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని,గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.ఎస్పీ వెంట సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బంది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube