కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం..!!

కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ రెండవ తారీకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతోంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సోనియాగాంధీ( Sonia Gandhi ) రాబోతున్నారు.

 Chief Minister Revanth Reddy Invitation To Kcr Details, Chief Minister Revanth-TeluguStop.com

అంతేకాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా దశాబ్ది ఉత్సవాలకు జూన్ రెండున హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి( KCR ) కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు.

తాను ఆహ్వానిస్తున్నట్లుగా లేఖను స్వయంగా అందించాలంటూ సలహాదారు హర్కర వేణుగోపాల్ ను ఆయన ఆదేశించారు.లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని వేణుగోపాల్ రేపు కేసీఆర్ కు అందించే అవకాశం ఉంది.

దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు.అనంతరం ఉ.10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో( Parade Ground ) త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు.పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్ తర్వాత అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్ పై నిర్వహించే వేడుకలకు సీఎం హాజరవుతారు.ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా పాల్గొంటారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను చాలా ప్రతిష్టాత్మకంగా.

ఘనంగా నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube