నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదం మోపి అరికట్టాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపి అరికట్టాలని, దీని ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డి.

 The Sale Of Fake Seeds Should Be Stopped State Agriculture Minister Niranjan Red-TeluguStop.com

జి.పి.అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పోలీస్ శాఖ ఉన్నత అధికారులతో కలిసి వానాకాలం సీజన్ ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు, కోట్లాది మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నదని, గడిచిన 9 ఏళ్లలో వ్యవసాయ రంగానికి దాదాపు 4.5 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, దేశంలో మన కంటే రెండు, మూడు రెట్లు పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీగా ఖర్చు చేయలేదని అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల విధానాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడంతో పాటు పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు.

వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువుల ను స్టాక్ ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మార్కెట్ లో దాదాపు మాయమయ్యాయి అని, అక్కడక్కడ ఉన్న కొన్ని నకిలీలను పూర్తిగా అరికట్టాలని, అమాయకులకు ఇబ్బంది కలిగించరాదని, క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి పక్క రాష్ట్రాల నుండి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి పెట్టి పకడ్బందీగా నియంత్రించాలని అన్నారు.

దేశంలో ఉన్న విత్తన అవసరాలలో దాదాపు 60% మేర తెలంగాణ నుంచి సరఫరా చేస్తున్నామని, దేశానికి విత్తన బాండాగారంగా తెలంగాణ ఆవిర్భవించిందని మంత్రి తెలిపారు.

నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిఘా పెంచాలని మంత్రి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, ఉద్యానవన అధికారిణి జ్యోతి, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు హజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube