నెల రోజుల్లోగా ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా:రాబోయే నెల రోజుల్లోగా ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆడిట్ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

 Audit Objections Should Be Resolved Within A Month District Collector Anurag Jay-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, మార్కెటింగ్, పంచాయితీ శాఖల పరిధిలో ఎక్కువ ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్ లో ఉన్నాయని,

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, అట్టి అభ్యంతరాలకు నెల రోజుల్లోగా సరైన పత్రాలతో కూడిన వివరణను ఆడిట్ బృందానికి అందజేయాలని కోరారు.తిరిగి నెల రోజుల్లోగా మరో సమావేశం నిర్వహిస్తానని, అప్పటివరకు ఆడిట్ అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ చంద్రశేఖర్, జిల్లా ఆడిట్ అధికారి బి.స్వప్న, ముఖ్య ప్రణాళిక అధికారి పి.బి.శ్రీనివాస చారి, పంచాయితీ అధికారి రవీందర్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube