తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్( Rajanna Sircilla District Police Headquarters ) లో,జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.
రాజన్న సిరిసిల్ల జిల్లా జూన్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం( Telangana Formation Day )ను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో,హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీస్ అధికారులతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.సంఘ విద్రోహుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలలో భరోసా కల్పిస్తూ స్నేహపూర్వక పోలీసుగా చేస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తునామని అన్నారు.
అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, డ్యూటీ మైండ్, మరింత బాధ్యతతో పని చేసి జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవల ను బాధ్యతతో అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు.అనంతరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పథకాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) అందజేశారు.
ఉత్కృష్ట సేవా పథకం సి.ఐ అనిల్ కుమార్,సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్,అతి ఉత్కృష్ట సేవా పథకం ఏ.ఎస్.ఐ బాబు గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్,అతి ఉత్కృష్ట సేవా పథకం,ప్రభాకర్, డి ఏ ఆర్ రాజన్న సిరిసిల్ల,అతి ఉత్కృష్ట సేవా పథకం,స్వామి రావు,డి ఏ ఆర్ రాజన్న సిరిసిల్ల,అతి ఉత్కృష్ట సేవా పథకం,వెంకటేష్,తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్,అతి ఉత్కృష్ట సేవా పథకం,ప్రకాష్, హోం గార్డ్ ,రాజన్న సిరిసిల్ల,అతి ఉత్కృష్ట సేవా పథకం,ఇక్బాల్ పాషా, హోం గార్డ్ ,రాజన్న సిరిసిల్ల,అతి ఉత్కృష్ట సేవా పథకం,నర్సింహ ప్రసాద్, హోం గార్డ్ ,రాజన్న సిరిసిల్ల,అతి ఉత్కృష్ట సేవా పథకం,దేవరాజ్,హోం గార్డ్ ,రాజన్న సిరిసిల్ల,అతి ఉత్కృష్ట సేవా పథకం,ఎంమల్లేశం,హోం గార్డ్ ,రాజన్న సిరిసిల్ల లకు పథకాలు అందించమని అందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, రవికుమార్, ఆర్.ఐ లు,సి.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.