సెస్ డైరెక్టర్ ను అరెస్టు చేయాలి - బాధితులకు న్యాయం చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా: సెస్ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరిని వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేశారు.అనంతరం తాసిల్దార్ రామచంద్రంకు ఫిర్యాదు చేశారు.

 Cess Director Should Be Arrested Justice For The Victims, Cess Director , Varusa-TeluguStop.com

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో కొండాపురం శ్రీనివాస్ రెడ్డి భూమి 29 గుంటలు సర్వేనెంబర్ 749/1 బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు డైరెక్టర్ వరుస కృష్ణ హరి అక్రమంగా ఆక్రమించి అమ్మి వేయడం జరిగిందన్నారు దీనిపైన సంబంధిత భూ యజమాని హైకోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో సెస్ డైరెక్టర్ తో పాటు 15 మంది పైన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగిందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమాలు రోజురోజుకు మితి మీరుతున్నాయని పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్ తమ అనుచరులు చేస్తున్న దురాగతాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు.తహసిల్దార్ కార్యాలయంలో ఈ భూమిని ఎవరు మార్చారు ఎందుకు మార్చారని తాసిల్దార్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.

తప్పుడు పనులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి శిక్షించడం జరుగుతుందన్నారు.

ఈ ధర్నాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షులు సుడిది రాజేందర్, బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్,నాయకులు కొత్తపల్లి దేవయ్య, ఎండి ఇమామ్, మానుక నాగరాజు,చిన్ని బాబు, బిపేట రాజు, మామిండ్ల కిషన్ ,వంగ మల్లారెడ్డి, గంగయ్య, చెరుకు ఎల్లయ్య , గంట అంజయ్య గౌడ్,బింగి మల్లేశం , నరేందర్, మొగుళ్ల మధు ,శెట్టి పెళ్లి బాలయ్య,, గుడ్ల శ్రీనివాస్ ,ఎండి హుస్సేన్, గుర్రపు రాములు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube