తులసి ఆసుపత్రిలో గుండె వ్యాధితో ఉన్న మహిళకు కాన్పు, తల్లి బిడ్డ క్షేమం..

మహిళ దినోత్సవం రోజున ఆడ శిశువుకు పురుడు పోసిన డాక్టర్ అనిత .డాక్టర్ అనితకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు వేములవాడ:తులసి ఆస్పత్రిలో గుండె వ్యాధి ఉన్న మహిళకు కాన్పు ,తల్లి బిడ్డ క్షేమం.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తులసి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేసి మహిళా దినోత్సవం రోజు ఆడ శిశువు కు పురుడు పోశారు.వివరాల్లోకి వెళితే చందుర్తి మండలం లోని ఓ గ్రామానికి చెందిన మహిళ గత కొన్ని రోజులుగా గుండె వ్యాధితో బాధపడుతూ ఇటీవల గర్భవతి అయింది.

 A Woman With Heart Disease Gave Birth In Tulsi Hospital, The Mother And Baby Are-TeluguStop.com

కాన్పు కోసం రెండు రోజుల క్రితం వేములవాడ తులసి ఆసుపత్రిలో చేరగా డాక్టర్ అనిత ఆమెను పరీక్షించి పలు జాగ్రత్తలు తీసుకొని, అనస్తీసియన్ డాక్టర్ తిరుపతి సహకారంతో బుధవారం సిజేరియన్ చేసి కాన్పు చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మాయి జన్మించడం పట్ల ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

గుండె వ్యాధి ఉన్న డాక్టర్ అనిత రిస్కు తీసుకొని ఆపరేషన్ చేసి తమ బిడ్డకు జన్మనివ్వడం పట్ల డాక్టర్ అనితకు వారు కృతజ్ఞతలు తెలిపారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తమ ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించడం ఆనందంగా ఉందని ఆస్పత్రి ఎండి సురేష్ హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం డాక్టర్ అనిత మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా ఎలాంటి అపాయం కలగకుండా కాన్పు చేయడం జరిగిందని అన్నారు.ముఖ్యంగా ఎవరైనా ఏ వ్యాధితో నైనా బాధపడుతున్న వారు మనోధైర్యంతో, గుండె నిగ్రహంతో ఉండాలని ఆమె సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube