భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

 Savitribai Phule Was The Reformer Of Indian Society And The Country's First Woma-TeluguStop.com

ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మహాజన్ సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి శ్రామిక మహిళా సాధికారిత అనేది ఆమెతోనే సాధ్యమైందని.

తన భర్త పూలే తో కలిసి 1841జనవరి 1న పూణే లో మొదటి మహిళా పాఠశాల ప్రారంభించారని తెలిపారు.సావిత్రిబాయి పూలే త్యాగాలను ప్రభుత్వం గుర్తించి ఆమె జయంతి రోజును జనవరి 3న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి భాయి పూలే కు భారతరత్న బిరుదు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ముక్క శ్రీ నివాస్ , పంతం కిషన్, చెన్ని బాలయ్య, మస్కూరి అశోక్, తదితరులు పాల్గొని సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube