కాకినాడ జిల్లా పిఠాపురం( Pithapuram ) బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు( Varupula Subbarao )కి స్వల్ప గాయాలయ్యాయి.
రెండు కార్లు ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది.ఒక్కసారిగా పశువులు రోడ్డు పైకి రావడంతో ఒక కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి మరో కారు ఢీకొనడం జరిగింది.
దీంతో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయి.ఈ క్రమంలో కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో సుబ్బారావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
వెంటనే మరొక కారులో సుబ్బారావు కాకినాడ వెళ్లడం జరిగింది.ఈ ఘటనలో పెద్ద ప్రమాదం నుండి ప్రాణాలు బయటపడ్డాయి.
వరుపుల సుబ్బారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.2004లో జరిగిన ఎన్నికలలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.అనంతరం రాష్ట్ర విభజన జరగడంతో.2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ(YCP )లో జాయిన్ అవ్వడం జరిగింది.ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో కూడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.కానీ తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) అధికారంలోకి రావడంతో 2016లో.వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు.సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ దక్కకపోవడంతో తిరిగి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికలలో తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుండి వరుపుల సుబ్బారావు ఎమ్మెల్యేగా పోటీ చేశారు.