రైతుల ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) రైతుల అమ్ముకునే వరి ధాన్యానికి బోనస్ ధర చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గురువారం ధర్నా చేపట్టారు.

 500 Bonus For Farmers' Grain-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తానని ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడం తీవ్ర అన్యాయమని అన్నారు.

రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం మద్దతు ధరపై రూ.500/- బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని డిమాండ్ చేశారు.

రైతులు( Farmers) పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలని.వడ్లకు రూ.500 ల బోనస్ ఇవ్వాలన్నారు.పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనన్నారు.

రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు.ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ప్రకటిస్తది అని సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేయడమే అని అన్నారు.

ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది.అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు.రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు.ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పెడుతుందని ఆగయ్య ఆరోపించారు.

రైతులు పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలని.వడ్లకు రూ.500 ల బోనస్ ఇవ్వాలని అని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ తోట ఆగన్న గారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ తోట ఆగన్న( Thota Agaiah ) మాట్లాడుతూ……పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమే అని ఆయన అన్నారు.

తక్షణమే రైతులకు 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రైతుల పక్షాన తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ రాష్ట్ర పవర్ లూమ్స్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ,వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, సర్పచులు ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube