ఎగిసిపడిన నిప్పు రవ్వలు. వందల ఎకరాల్లో గడ్డి దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఒక్కసారిగా ఎల్లారెడ్డిపేట( Yellareddypet )లో కరెంట్ తీగల నుండి నిప్పు రవ్వలు ఎగసిపడగా వందల ఎకరాల్లో కోసిన వరి పంట గడ్డి కాలిపోయింది.ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో గల నూకల శ్రీనివాస్ యాదవ్ కు చెందిన పంట పొలంలో వైర్లు చేతికందే ఎత్తులో ఉన్నాయి.

 Blown Fire Embers. Hundreds Of Acres Of Grass Burned-TeluguStop.com

వీటిని సరి చేయాలనీ కోరుతూ సదరు రైతు శ్రీనివాస్ యాదవ్ సెస్ అధికారులకు విన్నవించి వైర్లను సరి చేయాలనీ కోరుతూ సెస్ అధికారులకు డబ్బులు కూడా చెల్లించారు.డబ్బులు చెల్లించి 20 రోజులు కావస్తు ఉన్న విద్యుత్ వైర్లను సరి చేయలేరు.

దీంతో విద్యుత్ వై ర్ల నుండి నిప్పు రవ్వలు కింద పడగా ఒక్క సారిగా మంటలు చెలరేగి వందల ఎకరాల్లో వరి గడ్డి మొత్తం కాలిపోయింది.అక్కడే ఉన్న రైతులు అప్రమత్తమై చెట్ల కొమ్మలతో మంటలను బోర్ మోటార్ ల వద్దకు రాకుండా ఆకులతో మంటలను అదుపు చేశారు.

సకాలంలో రైతులు ఉండడం వల్ల బోర్ మోటార్ లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఇప్పటికైనా సెస్ అధికారులు స్పందించి తన పొలంలో ఉన్న వైర్లను సరి చేయాలని లేని పక్షంలో రేపు సెస్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తానని నూకల శ్రీనివాస్ యాదవ్ సెస్ అధికారులను కోరారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube